నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే-రాజ్ థాక్రే సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. మరాఠీ గుర్తింపు కోసం కలిసి పోటీ చేస్తున్నామని.. ఆర్థిక రాజధాని ముఖ చిత్రాన్ని మారుస్తామని వెల్లడించారు.
జనవరి 15న జరిగే ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-ఎంఎన్‌ఎస్ కూటమి కలిసి పోటీ చేస్తాయని రాజ్ థాక్రే తెలిపారు. ముంబైకి మరాఠీ మేయర్ రాబోతున్నట్లు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో ఆ మేయర్ వస్తారని చెప్పుకొచ్చారు. ఉద్ధవ్ థాక్రే కూడా ధీమా వ్యక్తం చేశారు.



