నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావో అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెన్‌గర్ జైలు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు బాధితురాలు తల్లి పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు తమ కుటుంబానికి మరణశాసనంగా ఆమె అభివర్ణించారు. డబ్బు ఉన్నవారు గెలుస్తారు, డబ్బు లేనివారు ఓడిపోతారు అని ఆమె విచారం వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులు, న్యాయవాదులు, సాక్షులకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే భద్రతను ఉపసంహరించిందని, కోర్టు తీర్పు తమ భయాలను మరింత పెంచిందని అన్నారు. ఇటువంటి కేసుల్లో దోషికి బెయిల్ లభిస్తే.. కుమార్తెలు ఈ దేశంలో ఎలా సురక్షితంగా జీవించగలరని ప్రశ్నించారు. ఈ నిర్ణయం తమకు మరణం కంటే తక్కువ కాదని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మండి హౌస్ సమీపంలో తన తల్లితో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు.
సుప్రీంను ఆశ్రయిస్తా: ఉన్నావో అత్యాచార కేసు బాధితురాలు
- Advertisement -
- Advertisement -



