Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కొట్టానికి నిప్పు పెట్టిన దుండగులు

కొట్టానికి నిప్పు పెట్టిన దుండగులు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని రోటిగూడ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వడ్రంగి కొట్టానికి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడు పాలాజీ సుధాకర్ కి చెందిన విలువైన పనిముట్లు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఉపాధి కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టంలో ఉన్న తన వడ్రంగి విలువైన సామాన్లతో సహా పూర్తిగా కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -