- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై లైంగిక ఆరోపణల కేసులో జైపూర్ పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యశ్ దయాళ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితుడిపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, సేకరించిన సాక్ష్యాలు (మొబైల్ చాట్, ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డులు, హోటల్ రికార్డులు) ఆరోపణలను బలపరుస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఈ దశలో అన్యాయంగా ఇరికించారని చెప్పలేమని, అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
- Advertisement -



