నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ బుధవారం (డిసెంబర్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. ఆరావళి శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆరావళిలో ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఆరావళి కీలక పాత్ర పోషిస్తుందని.. దాని దీర్ఘకాలిక రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. ఆరావళిలో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తగ్గిన మోడీ సర్కార్..ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



