Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్ఏ రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

ఏ రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

- Advertisement -
  • – ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి  
  • – సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ
  • నవతెలంగాణ -తాడ్వాయి 
  • ఈ రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తాడ్వాయి మండలం సీపీఐ(ఎం) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం దుగ్గి చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ములుగు జిల్లా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా కూడా, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలం అయింది అని అన్నారు. తాడ్వాయి మండలంలో రాజకీయ పార్టీ జోక్యం లేకుండా గ్రామసభల ద్వారా పేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా రైతు భరోసా పెండింగ్ లో ఉన్న రైతులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఎటువంటి కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని, దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని అన్నారు. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఊకె ప్రభాకర్, అలెం అశోక్, దాసరి కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -