నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డుపై పెద్దపులి ప్రత్యక్షమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, పర్యాటకులు ప్రయాణిస్తున్న ఘాట్ రోడ్డుపైకి అకస్మాత్తుగా పెద్దపులి రోడ్డును దాటుతూ కనిపించింది. దీంతో పలువురు ప్రయాణికులు ఆశ్చర్యపోతూ తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అయితే, వాహనాల హెడ్‌లైట్లు, కారు వెలుతురు చూసిన పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. నల్లమల అటవీ ప్రాంతం భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతుండటంతో అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలు ఈ మధ్య కంటపడుతుంటం విశేషం. ఇక నల్లమల అటవీ ప్రాంతంలో రాత్రి వేళ ప్రయాణిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నల్లమల ఘాట్ రోడ్డులో పెద్దపులి ప్రత్యక్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



