- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -



