నవతెలంగాణ-హైదరాబాద్: టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివాజీ మాటలలో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను అని నటి జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. కానీ ఆయన క్షమాపణలను మా అసోసియేషన్ అంగీకరించ ఆశ్యర్యాన్ని కలిగించింది. మాలో తాను సభ్యురాలినే, తీవ్రమైన మందలింపు లేకుండా ఆయన క్షమాపణలను అంగీకరించడం సరికాదని, పబ్లిక్ కార్యక్రమాల్లో మహిళాల పట్ల అలాంటి పదాలు ఉపయోగించడం సమంజసం కాదని మండిపడ్డారు.
మహిళల పట్ల శివాజీ వాడిన పదజాలంతోనే సమస్య ఉత్పనమైందని, ఫిల్మ్ చాంబర్, మా అసోసియేషన్, ఇతర వేదికల ద్వారా ఈ సమస్యపై చర్చపెట్టాలని, పబ్లిక్ కార్యక్రమాల్లో స్త్రీల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు క్షమించరానిదని ప్రముఖ డైరెక్టర్ నందినిరెడ్డి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతగానే ఉండాలని చెప్పారు.
ప్రముఖ రంగంలో ఉండి స్త్రీల పట్ల నీచంగా మాట్లాడం సరికాదని, శివాజీ మాటలతో సమాజానికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారని సామాజీక కర్త సునీత కృష్ణన్ ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహంతోనే ఆయన క్షమాపణలు చెప్పారు తప్పా, మాములుగా శివాజీకి క్షమాపణలు ఉద్దశ్యం కూడలేదని మండిపడ్డారు. మంచి విషయాలు చెప్పాలకుంటే శివాజీ వాడిన పదజాలం సరైంది కాదని విమర్శించారు. క్షమాపణలు చెప్పినంత మాత్రన చేసిన తప్పును సరిదిద్దుకోలేరని, బాధ్యత గల స్థానంలో ఉండి దిగజారుడు మాటలు మాట్టాడారని టీవీ యాంకర్ ఝాన్సీ విమర్శించారు.



