- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన గోడవలో భర్త కొట్టడంతో భార్య మృతి చెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన రారాజు, విజయలక్ష్మి దంపతులు నగరంలో నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన రారాజుతో తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం జరిగిన గొడవలో రారాజు, విజయలక్ష్మి ముఖంపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



