Thursday, December 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటితో మాజీ ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు విచారణ ముగింపు

నేటితో మాజీ ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు విచారణ ముగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో కొన్నిటికి సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ప్రభాకర్ రావు తన పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట.

రెండు వారాల విచారణకు సంబంధించిన రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు అందించనున్న సిట్ బృందం. జనవరి 16న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్తో పాటు ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక రేపటి నుంచి సిట్ ఏం చేయబోతుందనేదే ఉత్కంఠగా మారింది. ఫోన్ టాపింగ్లో రాజకీయ నాయకుల పాత్రపై సిట్ బృందం ఆధారాలు సేకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -