నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో అవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనకుండా యూనిస్ ఖాన్ మధ్యంతర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ సమాచార ముఖ్య అధికారి షఫీకుల్ ఆలం పేర్కొన్నారు. అవామీ లీగ్ రాబోయే జాతీయ ఎన్నికలలో పోటీ చేయకుండా ఆ పార్టీపై నిషేధం విధించనట్టు తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశం తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అలజడి చేలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల తీవ్రమైన నిరసనతో షేక్ హాసినా ప్రభుత్వం పడిపోయి దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత యూనిస్ ఖాన్ నేతృత్వంలో మద్యంతర ప్రభుత్వం దేశపాలన పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత సజావుగా పాలన కొనసాగుతుండగా తీవ్రవాద విద్యార్థి నాయకుడు షరిప్ ఉస్మాన్ హాదీ హత్యతో మరోసారి ఆ దేశంలో ఉద్రికత్తలు తలెత్తాతాయి.



