Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డికి ఘన సన్మానం

రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ లో గల శ్రీ రంగనాథస్వామి ఆలయ కమిటీ సభ్యులు గురువారం కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎంపీ ల్యాండ్స్ 2025-26 నుంచి 5లక్షలు రూపాయలను ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ రంగనాథ స్వామి ప్రతిమ ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుండేటి అచ్చల్ మోహన్ రెడ్డి, లిఫ్ట్ చైర్మన్ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నర్సారెడ్డి, లక్ష్మణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -