డీఎస్పీ నాగేంద్ర చారి
నవతెలంగాణ – గంభీరావుపేట
మూఢనమ్మకాల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి అన్నారు. గురువారం గంభీరావుపేట మండల పరిధిలోని హీరాలాల్ తండాలో మూఢనమ్మ కాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు. హీరాలాల్ తండా లో ప్రజలు మూఢనమ్మకాల భారీనా పడి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్బంగా డీ ఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ.. మంత్రాల పేరిట బాగు చేస్తామని చెప్పితే ప్రజలు నమ్మవద్దని, మంత్రాలు తంత్రాలు అనే మూఢనమ్మ
కాల ద్వారా ఒకరు పై ఒక్కరు కక్ష్యలు పెట్టుకొని శాంతి భద్రతకు విఘాతం కల్గించవద్దన్నారు.
అమాయక ప్రజలను మంత్రాల పేరిట మోసాలకు పాల్పడితే మ్యాజిక్ రివైడీస్ ప్రీవెన్స్ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. ఆనంతరం ప్రజలకు సీసీ కెమెరాల అవశ్యకతను సైబర్ నేరాలపై ప్రజలు అవగాహనా కల్గి ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి పిర్యాదు చేయాలన్నారు. మత్తు పదార్థాల భారీనా పడి యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా తల్లితండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వివరించారు. మూఢనమ్మకాలు, రోడ్డుప్రమాదాలు, మత్తు పదార్థాల వాడకం ద్వారా జరిగే నష్టాలను పోలీసు కళాబృందంతో ప్రజలను అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎలారెడ్దిపేట సిఐ.శ్రీనివాస్ గౌడ్, ఏఎస్ఐ దేవేందర్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది, సర్పెంచ్ భూక్య పద్మ దేవుసింగ్, ఉపసర్పంచ్ అజ్మెరా కిషన్ తో పాటు ముచ్చర్ల భారస సీనియర్ నేత చేవుల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.



