- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన యువకుడితో సంబంధం పెట్టుకున్న బాలికను ఆమె తల్లిదండ్రులే పురుగుల మందు తాగిచ్చి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ నెల 14న బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
- Advertisement -



