Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై తండ్రి మాదాసు బుచ్చయ్య (48), అతని చిన్న కుమారుడు లోకేష్ (22) మృతి చెందారు. గురువారం బుచ్చయ్య ట్రాక్టర్ ట్యాంకర్‌లో మోటర్‌తో నీళ్లు కొడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన లోకేష్ ట్యాంకర్‌ను తాకడంతో అతడూ షాక్‌కు గురై మరణించాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -