Friday, December 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్ వ‌ద్ద అణ్వాయుధాలు..బుష్-పుతిన్ ఆందోళ‌న‌

పాక్ వ‌ద్ద అణ్వాయుధాలు..బుష్-పుతిన్ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్-అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌ మధ్య జరిగిన ‘పాకిస్థాన్ అణ్వాయుధ’ సంభాషణ వెలుగులోకి వచ్చింది. జూన్ 16, 2001లో స్లోవేనియాలో జార్జ్ డబ్ల్యూ బుష్‌-పుతిన్ మధ్య వ్యక్తిగత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2001-2008 మధ్య పలుమార్లు సమావేశాలు, ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. ఆ సందర్భంగా పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని ఒక ముఖ్యమైన నాన్-ప్రొలిఫెరేషన్‌పై ఆందోళన వ్యక్తం చేసినట్లుగా పత్రాలు పేర్కొన్నాయి.

ఇక 9/11 ఉగ్రవాదంపై యుద్ధం తర్వాత పాకిస్థాన్ అధికారికంగా అమెరికాకు కీలక మిత్రదేశంగా మారింది. అయినప్పటికీ వాషింగ్టన్-మాస్కో రెండూ కూడా అణు నిర్వహణను తీవ్ర అనుమానంతో చూశాయని ట్రాన్స్‌క్రిప్ట్‌ల‌ు వెల్లడించాయి. అయితే 2000లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్‌వర్క్ ఇరాన్, ఉత్తర కొరియా, లిబియా వరకు విస్తరించినట్లుగా ట్రాన్స్‌క్రిప్ట్‌ల్లోని సంభాషణను బట్టి అర్థమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -