Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా 11వరోజు ధనుర్మాస ఉత్సవములు

వైభవంగా 11వరోజు ధనుర్మాస ఉత్సవములు

- Advertisement -

భక్తిశ్రద్ధలతో సుదర్శన హోమాలు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మిర్యాలగూడ సీతారాంపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ దేవాలయం (భగవద్గీత మందిరం) లో ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శుక్రవారం 11వ రోజు శ్రీ గోదాదేవి  అనుగ్రహించిన తిరుప్పావై వ్రతం శ్రీమాన్ ఠంయ్యాల ఫణికుమారాచార్యులు, సునిల్ కుమారాచార్, వరుణ్ కుమారాచార్యులు మొదలైన వైదిక బృందం అధ్వర్యంలో  తెల్లవారుజాము నుండే వైభవంగా జరుగుచున్నవి. తిరుప్పావై పాశురముల గురించి చాలా విశేషమైన అర్థవివరణలతో ప్రవచనములు పంచాంగం ప్రకారం రోజువారి నక్షత్రములననుసరించి ఉదయం 9:30 గంటలకు శ్రీ సుదర్శన హోమం దంపతులచే నిర్వహించబడుచున్నది.

ఆదివారం రోజు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారు ఆలయాన్ని సందర్శించుటకు వోచ్చేయుచున్నారు. కావున ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని  ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు కుశలయ్య తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -