గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు: మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు మండలం శర్భనపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన మొగలగాని నరసయ్యను శుక్రవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ హైదరాబాద్ లో తన ఆఫీసులో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. పుట్టిన ఊరికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదన్నారు. సర్పంచ్ పదవి ద్వారా ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి నప్పుడే గ్రామ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు
బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన శర్భనపూరం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు పి. ఎ.సి.ఎస్.మాజీ చైర్మన్ మొగలగాని మల్లేష్ ఈ కార్యక్రమంలో ఉన్నారు.



