Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశివాజీ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ముఖ హీరోయిన్ స్పంద‌న‌

శివాజీ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ముఖ హీరోయిన్ స్పంద‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. తప్పు దుస్తుల్లో కాదు… తప్పు చూపులో ఉంది అంటూ మహిళలు, సోషల్ మీడియా యూజర్లు కూడా ఘాటుగా స్పందించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ స్పందించారు. ఓ కార్యక్రమంలో ఈ అంశంపై ఆమెను ప్రశ్నించగా, ఇతరుల వ్యాఖ్యలపై స్పందించడం లేదా వారి వ్యక్తిగత అభిప్రాయాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపింది. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడింది. ఒక మహిళకు తనకు నచ్చిన దుస్తులు ధరించే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, దానిపై ఎవరూ తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదని హెబ్బా స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -