Wednesday, May 21, 2025
Homeజాతీయంబెయిల్‌ కోసం ఏడాదిపాటు జైల్లో ఉండాలనే నియమం లేదు

బెయిల్‌ కోసం ఏడాదిపాటు జైల్లో ఉండాలనే నియమం లేదు

- Advertisement -

– మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ:
మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్‌ కోసం ఏడాది పాటు జైల్లో ఉండాలనే నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. రూ. 2 వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అన్వర్‌ ధేబర్‌కు జస్టిస్‌ అభరు ఎస్‌. ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం బెయిల్‌ మంజారు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అన్వర్‌ ధేబర్‌ను గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ జైల్లోనే ఉన్నారు. ధేబర్‌పై ఉన్న ఆరోపణలు నిజమైతే గరిష్టంగా ఏడేళ్ల శిక్ష పడుతుందని, ఈ కేసులో సాక్షుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని ధర్మాసనం తెలిపింది. పాస్‌పోర్టు అప్పగించడం, ఇతర షరతులతో ధేబర్‌కు బెయిల్‌ మంజారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం వ్యాపారంలో అక్రమాలు, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన చార్జిషీట్‌ ఆధారంగా ఇడి ఈ కేసును విచారణ చేస్తోంది. ఈ కుంభకోణంలో మొత్తంగా రూ. 2,161 కోట్ల అవినీతి జరిగిందని ఇడి ఆరోపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -