- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐఎఎస్ (IAS) అధికారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవసరమైతే పదోన్నతులను కూడా నిలిపివేస్తామని పేర్కొంది. IAS అధికారులు తమ వార్షిక స్థిరాస్తి వివరాలను 2026 జనవరి 31లోగా తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. గడువు దాటితే ప్రమోషన్లపై ప్రభావం ఉంటుందని తెలిపింది.
- Advertisement -



