Saturday, December 27, 2025
E-PAPER
Homeక్రైమ్భార్యపై అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

భార్యపై అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమకొండ(D) ఆత్మకూరు (M)లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల నుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్టపై పొడిచాడు. ప్రస్తుతం అనూష ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -