- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. పెద్దవంగర మండల కేంద్రానికి చేరుకున్న కేటీఆర్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -



