నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దీనిపై దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి పేదల కంటే కార్పొరేట్ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల హక్కులకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడానికి నాటి యూపీఏ ప్రభుత్వం ముందుచూపుతో గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



