Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదండోరా మూవీ టీంకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కితాబు

దండోరా మూవీ టీంకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కితాబు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దండోరా సినిమాకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కితాబు ఇచ్చారు. తెలంగాణ మట్టిలో పుట్టిన కథగా ‘దండోరా’ తనను ఎంతో ఆకట్టుకుందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ జీవనశైలిని, ఇక్కడి మనుషుల మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను చాలా సహజంగా చూపించారని ప్రశంసించారు. ‘బలగం’ సినిమా తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన చిత్రంగా ‘దండోరా’ను కోమటిరెడ్డి అభివర్ణించారు. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలు మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాయని పేర్కొన్నారు. మంచి సందేశంతో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘దండోరా’ టీమ్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. శివాజీ, నవదీప్, నందు, బింధు మాధవి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -