– లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
– బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణకొత్తపళ్లి గ్రామానికి చెందిన నలుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు ఆ గ్రామ ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య తెలిపారు. శనివారం ఎమ్మెల్యే డా మురళి నాయక్ క్యాంప్ ఆఫీసులో చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. పేద ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు ఈ చెక్కులను అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతల పాల్గొన్నారు
పేద ఆడపిల్లకు వరం కళ్యాణ లక్ష్మి చెక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



