Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటిప్పర్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 22 మందికి గాయాలు

టిప్పర్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 22 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో NH 65పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మెదక్‌ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -