నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పశువైద్యాధికారి నల్లమాసు జహంగీర్ గౌడ్ సమక్షంలో 665 గొర్రెలు, 811 మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు గ్రామంలో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే నట్టల నివారణ మందును రైతులు తీసుకుని ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగపరుచుకొని గొర్రెల,మేకల పెంపును అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
పశువైద్యాధికారి తో సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇంకా మీకు పశువులకు గాని,మేకలకు గొర్లకు గాని ఏమైనా పనిముట్లు, మందులు అవసరం ఉంటే నన్ను సంప్రదింస్తే నా సొంత నిధులతో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,వార్డు సభ్యులు దొంకేన పాండురంగం,జిన్న నర్సింహ,పిన్నం పాండు కవిత,పిన్నం సత్తయ్య హంసమ్మ,తోటకురి పాండు,మాజీ వార్డు సభ్యులు వి పరమేష్,మాజీ కోఅప్షన్ మెంబర్ అశోక్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఎండి బాబా,మాజీ స్కూల్ చైర్మన్ యు మహేందర్, ఆర్ మహిపాల్, ఏ న్ రాము, డి అనిల్,జిన్న శ్రీను, కిష్టయ్య, అశోక్, బిచ్చల మహేష్, మల్లేష్, మహేష్, మునీర్,గ్రామస్థులు పాల్గొన్నారు.



