– తుది దశకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్
– 25వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో కసరత్తు
– జూన్ 2న ప్రొసీడింగ్ కాపీల అందజేత
– సిబిల్ స్కోర్‌తో దరఖాస్తుదారుల్లో ఆందోళన
– ఉప కులాల రిజర్వేషన్లకు ప్రాధాన్యం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చకచకా సాగుతోంది. మండలాల్లో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా అర్హులను ప్రకటించనున్నారు. అయితే, సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ఉండనుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కులాలకు చెందిన వారికి ఈ స్కీం ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించనుంది. గత నెల 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించగా.. మండలాల వారీగా అర్హుల జాబితాకు సంబంధించి సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. లబ్దిదారులు రూ.50 వేలకు మించి రుణాలు తీసుకోవాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందనే విషయాన్ని పరిశీలించి, దాని ఆధారంగానే రుణం మంజూరు చేయనున్నారు. సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు రుణాలు అందిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో దరఖాస్తు దారులు టెన్షన్ పడుతున్నారు.
25 నుంచి జిల్లా స్థాయిలో పరిశీలన
రాజీరు యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలిసు ్తన్నారు. మండలంలో స్పెషల్ ఆఫీ సర్‌గా ఎంపీడీఓ, మున్సిపాల్టీలో స్పెషల్ ఆప ˜ీసర్‌గా మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీలో సర్కిల్ స్పెషల్ ఆఫీసర్‌గా సర్కిల్ ఉప కమిషనర్, లీడ్ బ్యాంకు మేనేజర్, డీఆర్డీఏ పీడీ, కార్పొరేషన్ ప్రతినిధి ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతోంది. దరఖాస్తుదారుడి బ్యాంకు సిబిల్ స్కోర్, అర్హతకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలన చేస్తారు. ఈనెల 25వ తేదీ వరకు జిల్లా కమిటీకి పంపిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆదనపు కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్, ఇండిస్టీయల్ జీఎం, డీడబ్ల్యూఓ, డీఆర్డీఓ పీడీ ఆధ్వర్యంలో చివరి దశ పరిశీలన చేసి జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసంలో అర్హత సాధించిన యువతీ, యువకులకు రుణ మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.
ఉప కులాల వారీగా రిజర్వేషన్లు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 66,648 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీ, ఈబీసీ-37,935, ఎస్సీ-16,300, ఎస్టీ-2,196, మైనార్టీ, క్రిస్టియన్-10,219 మంది ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఉప కులాల రిజర్వేషన్లను పాటించనున్నారు. గ్రూప్-1 కేటగిరీలో వచ్చే కులాలకు 6.67 శాతం, గ్రూప్-2 కేటగిరీలో వచ్చే కులాలకు 60 శాతం, గ్రూప్-3 కేటగిరిలో వచ్చే కులాలకు 33 శాతం మేర రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుం టారు. అలాగే మహిళలకు 25 శాతం, వికలాం గులకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించారు.
మారిన ఆర్బీఐ నిబంధనలు
గతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు. అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే ష్యూరిటీ కింద సంతకాలు తీసుకునేవారే తప్ప, సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.50 వేల రుణం దాటితే సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో సిబిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు. ఇవే నిబంధనలు రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు వర్తించనుండటంతో వారిలో గుబులు మొదలైంది. కొందరు లబ్దిదారులకు పాన్‌కార్డులు లేకపోగా.. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారు మరికొందరుంటారు.
సిబిల్.. గుబుల్..
దరఖాస్తు చేసుకున్న వారిలో సిబిల్ స్కోర్ టెన్షన్ పుట్టిస్తోంది. సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. లబ్దిదారుల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు. బ్యాంకు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. రుణం తీసుకునే సమయంలో దీన్ని ప్రామాణికంగా పరిగణించి.. సదరు వ్యక్తి అర్హతను నిర్ధారిస్తారు. బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా.. పాతబకాయి కోసం వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకున్నా.. ఇలా అనేక రకాల పద్ధతులపై సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెజార్టీ ప్రజలు సిబిల్ స్కోర్‌కు అర్హత సాధించే అవకాశం లేదని చర్చ జరుగుతోంది.
చకచకా పరిశీలన..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES