– జూన్ 2 నుంచి చట్టం అమలు
– ఆరు వేల మంది ప్రయివేట్ సర్వేయర్ల ఎంపిక
– సాదాబైనామాల పరిష్కారాన్ని అధికారులు పారదర్శకంగా చేయాలి : రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– ముప్పిరితోట, భీమారంలో రెవెన్యూ సదస్సులు
నవతెలంగాణ-ఎలిగేడు/ జైపూర్
శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘భూభారతి (ఆర్‌ఓఆర్)’ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు అంకితం చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో, మంచి ర్యాల జిల్లా భీమారంలో మంగళవారం భూభారతిపై రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ముందుగా ముప్పిరితోటలో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల సమస్యలు పెరిగి, కుటుంబాల్లో వివాదాలకు దారి తీశాయని అన్నారు. సాదాబైనామా అంశాన్ని ధరణిలో చేర్చకపోవడం వల్ల భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు రైతులు తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు, మేధావులు, ప్రజలతో చర్చించి అందరూ కోరుకున్న విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి పలు మండలాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించామని చెప్పారు. ఈ చట్టంలో రైతులకు అన్ని హక్కులూ కల్పిస్తూ జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. రైతుల దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో భూము లను సర్వే చేయడానికి రాష్ట్రంలో 6,000 మంది ప్రయివేటు సర్వేయర్లను ఎంపిక చేసి వారం రోజుల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ప్రతి రెవె న్యూ కార్యాలయంలో డిసెంబర్ 31న జమాబందీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.
సాగునీరు అందించేందుకు కృషి : మంత్రి శ్రీధర్‌బాబు
జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేం దుకు కృషి చేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కొదురుపాక రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుల్తానాబాద్ పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు వెచ్చించామని, టెండర్లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. బీజేపీ దేశంలో తప్పుడు ప్రచారాల కోసం వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసు కుందని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలులో గత ప్రభుత్వం 2022-23లో రూ.290 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.700 కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేసిందని వివరించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు చెక్కులు, రైతులకు భూభారతి ప్రొసీడింగ్‌లను మంత్రులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాదరావు, సలహాదారు వేణుగోపాలరావు, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఫారెస్టు వివాదాలకు పరిష్కారం..
భూభారతి-2025 చట్టం ద్వారా భూసమస్య లకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని మంచిర్యాల జిల్లా భీమారం సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 18 రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి భూభారతి చట్టం తీసుకొచ్చినట్టు తెలిపారు. వంద రోజుల్లో ఈ చట్టం ద్వారా భూసమస్యలకు పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 జిల్లాల్లో 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా గుర్తించి అవగాహన కల్పిసున్నట్టు తెలిపారు. భీమారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు గా గుర్తించి భూసమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు 2200 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్టు వెల్లడించారు. ఇందులో 1100 దరఖాస్తులు ఉన్నట్టు తెలిపారు. సాదాబైనామా అంశంలో కోర్టులో స్టే ఉన్నందున అతి త్వరలో ఈ సమస్యలను కూడా పరిష్కరించుకుందామన్నారు. ఈ ప్రాంత రైతులు చెప్పినట్టు ఫారెస్ట్ వివాదం, ప్రభుత్వ భూముల ఇబ్బందులను పరిష్కరించేం దుకు కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నట్టు ప్రకటించారు. సదస్సులో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్, కలెక్టర్ కుమార్‌దీపక్ పాల్గొన్నారు.
భూభారతి రైతులకు అంకితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES