- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
- Advertisement -



