- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
జక్కల వారి గూడెం గ్రామంలోని వీధులలో వీధిలైట్ లేక గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న సమస్యను గుర్తించి గ్రామ సర్పంచ్ జక్కల రేవతి మహేష్ ఆదివారం గ్రామంలోని పలు వార్డులలో వీధిలైట్లను ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చీకటి లేని పాలన అందించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామ ప్రజలంతా పాల్గొని గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జక్కల పార్వతమ్మ ముత్యాలు , మాజీ సర్పంచ్ జక్కల శ్రీను , వార్డు సభ్యులు జక్కల శంకర్ , జక్కల కృష్ణ , కాంగ్రెస్ మండల నాయకులు జక్కల మల్లేష్ , జక్కల యాదయ్య , జక్కల దశరథ తదితరులు ఉన్నారు.
- Advertisement -



