- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మైదానంలోనే కుప్పకూలి మరణించారు. శనివారం ఢాకా క్యాపిటల్స్, రాజ్‌షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా, పిచ్ పరిశీలించిన జాకీ ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. వెంటనే వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- Advertisement -



