- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో అతి త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్ల మీదుగా వెళుతూ, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి నివాసంలో అల్పాహారం స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకుని మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- Advertisement -



