Wednesday, May 21, 2025
Homeప్రధాన వార్తలువిచారణకు హాజరుకండి

విచారణకు హాజరుకండి

- Advertisement -

– మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు
– మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటలకూ..
– కాళేశ్వరం విచారణ కమిషన్‌ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులిచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కూ నోటీసులను జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపౖౖె జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌ జూన్‌ 5న, హరీశ్‌రావు జూన్‌ 6న, ఈటల రాజేందర్‌ను జూన్‌ 9న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్‌ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్‌, క్వాలిటీకంట్రోల్‌, పే అండ్‌ అకౌంట్స్‌, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు… ఇలా అందరినీ ఇప్పటికే విచారించింది.
కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -