నవతెలంగాణ – బాల్కొండ
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును మార్చి గాంధీ పేరును రూపుమాపాలని చూస్తున్న కుట్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు హాజరై మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పెసరి వివేక్, పార్టీ నాయకులు మహమ్మద్ యునుస్, షేక్ వాహబ్, అన్వర్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



