- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్, డోంగ్లి, మండలాల ప్రజలు పోలీస్ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని మద్నూర్ ఎస్సై రాజు తెలియజేశారు. ఆదివారం ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సెలవులు వస్తున్నాయని సెలవుల రోజుల్లో ప్రజలు ఎక్కడికైనా వెళ్తే దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇరు మండలాల ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎక్కడైనా గుర్తు తెలియని మనుషులు కనిపిస్తే అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడమే కాకుండా పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు. మండలానికి నూతనంగా వచ్చిన ఎస్ఐ ఇరు మండలాల ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా పలు రకాల సూచనలు అందజేస్తూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
- Advertisement -



