- Advertisement -
నవతెలంగాణ పటాన్‌చెరు: సిగాచీ సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ విస్ఫోటంలో 54 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఆరు నెలల తరువాత శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సిగాచీ సీఈవోను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -



