Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఆ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు సేవలు ఎంతో గొప్పవని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ అభ్యున్నతి కోసం,ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను, వార్డు సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, నూత సర్పంచ్ లు లపంగి నరసింహ, అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్, పదం రవి, జిల్లా అలివేలు కృష్ణయ్య, రాపోలు యాదగిరి, పందుల లక్ష్మమ్మ, సంగీత, కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -