Monday, December 29, 2025
E-PAPER
HomeNewsలేబర్ కోడ్లు,విబిరాంజీ ఉపాధి చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను తక్షణమే ఉపసంహరించాలి

లేబర్ కోడ్లు,విబిరాంజీ ఉపాధి చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను తక్షణమే ఉపసంహరించాలి

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్ చట్టం, విబి రాంజీ ఉపాధి హామీ చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ఆయిటిపాముల గ్రామములో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అ ప్రజాస్వామికమైన ఐదు చట్టాలను చేసి దేశంలో రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించే విధానాలు తెచ్చారని విమర్శించారు.ప్రధానంగా లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను సమ్మెను ఉద్యోగ భద్రతను పోరాడే హక్కును నిర్వీర్యం చేసిందని, తక్షణమే ఈ చట్టన్నీ, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుందని హెచ్చరించారు . 2005లో యూపీఏ వన్ గవర్నమెంట్ లో 64 మంది వామపక్ష ఎంపీల పోరాటం ఫలితంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం వచ్చిందని ,ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం  వి బి రామ్ జి నూతన చట్టం తెచ్చి వ్యవసాయ కార్మికులకు పనులు లేకుండా, వలసలు వెళ్లే విధంగా చట్టం రూపొందించారని ఆరోపించారు. చట్టంలో 60 శాతం కేంద్రం నిధులు 40 శాతం రాష్ట్రాల నిధులు ఖర్చు పెట్టాలని, 40 శాతం నిధులు ఖర్చు చేయకపోతే 60 శాతం రా కేంద్రం ఇవ్వదని ,60 రోజులు వ్యవసాయ సీజన్ లో పనులు బంద్ పెట్టాలని, రూపొందించారని దీనివల్ల వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఇటకాల సురేందర్, ముక్కామల శైలజ, బొడ్డుపల్లి రేణుక,సైదమ్మ,కొండ్ర సుధాకర్, బ్రహ్మచారి,గుంటోజు శ్రీను,లింగమ్మ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -