Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంహాదీ హంతకులు భారత్‌కు రాలేదు: బీఎస్ఎఫ్

హాదీ హంతకులు భారత్‌కు రాలేదు: బీఎస్ఎఫ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన నిందితులు భారత్‌కు పారిపోయారంటూ వస్తున్న ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), మేఘాలయ పోలీసు విభాగం తీవ్రంగా ఖండించాయి. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీఎస్‌ఎఫ్ (మేఘాలయ ఫ్రంటియర్) అధికారులు స్పందిస్తూ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి నిందితులు భారత్‌లోకి ప్రవేశించినట్లు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. సరిహద్దుల్లో తమ బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పొరుగు దేశం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని వారు మండిపడ్డారు. అదేవిధంగా, బంగ్లాదేశ్ పోలీసులు, అక్కడి మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మేఘాలయ పోలీసులు కూడా తేల్చిచెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్‌లు తమ రాష్ట్రంలోకి ప్రవేశించలేదని, ఈ వ్యవహారంలో తాము ఎవరినీ అరెస్టు చేయలేదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -