- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ శాసనసభకు హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పలు ఆర్డినెన్సులను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
- Advertisement -



