నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావ్ లైంగికదాడి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు ప్రధాన నిందితుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్ధిప్ సింగ్ సెగార్ బెయిల్‌ను రద్దు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు జీవిత ఖైదును నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు తీర్పు. ఈ నిర్ణయాన్నిసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించగా కోర్టు ప్రాంగణం వెలుపల భారీ భద్రత మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలికి రోజుకు రోజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు మహిళ సంఘాలు కోర్టు ప్రాంగణం ఎదుట ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా కేసు విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు వివిధ సంఘాల నాయకులు భారీగా ఆందోళన చేపట్టారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ద్‌ప్ సింగ్ సెగార్‌కు బెయిల్ వెంటనే రద్దు చేయాలని, ఉన్నావ్ బాధితరాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కా లాంబా నాయకత్వం వహించారు. పోలీసులు అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
2017 ఉన్నావ్ అత్యాచార దోషి కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. క్రైమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ నేడు విచారించి, సెగార్ బెయిల్ రద్దు చేసింది.



