నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావ్ లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్ధిప్ సింగ్ సెగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెగార్ బెయిల్‌ను దేశ ఉన్నత న్యాయంస్థానం రద్దు చేసింది. ఈక్రమంలో ఉన్నావో బాధితురాలి తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీం నిర్ణయంతో న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరిగిందని, బాధితులకు రక్షణ లభించిదన్నారు. సుప్రీం తీర్పుతో ఏ కేసులో కూడా సెగార్ జైలు నుంచి బయటకు రాలేడని చెప్పారు. తమకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలియజేశారు.
బహిష్కరించబడిన బీజేపీ నాయకుడు సెంగర్ 2019 డిసెంబర్‌లో ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా నిరూపణ అయింది. జీవిత ఖైదుతో పాటు రూ. 25 లక్షల జరిమానా ఆయనకు విధించబడింది. ఈ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ, హత్యకు సంబంధించిన మరో సీబీఐ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నందున అతను జైలులోనే ఉన్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును అప్పీల్ పెండింగ్‌లో ఉంచి, బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. తాజాగా సెగార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు అయింది.



