- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 100 మీటర్లలోపు ఉన్న పర్వతాల వద్ద మైనింగ్‌కు గతంలో అత్యున్నత న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలను నిలిపివేస్తూ సీజేఐ ధర్మాసనం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అమికస్ క్యూరీని నియమించింది. ఆరావళిపై వివాదం దృష్ట్యా సుమోటోగా విచారణ చేపట్టింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది.
- Advertisement -



