Monday, December 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతైవాన్‌కు యుఎస్ ఆయుధాలు..ఖండించిన క్యూబా

తైవాన్‌కు యుఎస్ ఆయుధాలు..ఖండించిన క్యూబా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తైవాన్‌కు ఆయుధాల అమ్మకాల ప్యాకేజీకి ట్రంప్‌ ఆమోద ముద్ర వేయడాన్ని క్యూబా ఖండించింది. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్‌ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. చైనా సార్వభౌమాధికారం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే విధంగా తైవాన్‌కు భారీ ఆయుధాలను విక్రయించాలన్న అమెరికా నిర్ణయాన్ని తాము తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఒకే చైనా’అనే సూత్రానికి క్యూబా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆయుధాల విక్రయాన్ని ‘ఒకే చైనా’ సూత్రాన్ని ఉల్లంఘించడంగా ఇటీవల చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ అభివర్ణించారని క్యూబా మీడియా పేర్కొంది. ఈ చర్యలు తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే వేర్పాటు వాద శక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -