Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినయ్ రెడ్డిని కలిసిన అయ్యప్ప స్వాములు

వినయ్ రెడ్డిని కలిసిన అయ్యప్ప స్వాములు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ.. మామిడిపల్లి లో అయ్యప్ప దేవాలయంలో నిత్య అన్నదాన భవన నిర్మాణం, మౌలిక వసతుల కొరకు ప్రభుత్వం నుండి నిధులను ఇప్పించాలని కోరారు.

ఇందుకు వినయ్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, నిధులను మంజూరు చేయిస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ గురుస్వాములు అల్లకొండ భోజన్న, సొక్కాల వడ్ల శ్రీనివాస్, ఆకుల నడిపి రాజన్న, యోగిత్ రెడ్డి, గురుస్వాములు, గోజూరి హరీష్, మల్యాల శ్యాం, కుమ్మరి భుమేష్, చిట్యాల శ్రీధర్, స్వాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం మారుతి రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -