Wednesday, May 21, 2025
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ హింసోన్మాదం

ఇజ్రాయిల్‌ హింసోన్మాదం

- Advertisement -

– తాజా దాడుల్లో 76మంది మృతి
– మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికం
– నెతన్యాహు తీరును ఖండించిన పశ్చిమ దేశాలు
గాజా, లండన్‌:
గాజా వ్యాప్తంగా తన సైనిక చర్యలను విస్తరిస్తున్నట్టు ఆదివారం ఇజ్రాయిల్‌ ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా దేశాలు ఆ చర్యను తీవ్రంగా ఖండించాయి. గాజాలో ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు భరించరాని స్థితికి చేరుకున్నాయని తీవ్రంగా విమర్శించాయి. ఈ మేరకు మూడు దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేశాయి. ఈ సమస్యకు రెండు దేశాల ఏర్పాటే పరిష్కార మని, ఈ దిశగా తాము పాలస్తీనా దేశాన్ని గుర్తించ డానికి కట్టుబడ్డామని ఆ ప్రకటన పేర్కొంది. గాజాలోకి పరిమిత స్థాయిలోనే ఆహారం పంపేందుకు అనుమతి స్తామంటూ ఇజ్రాయిల్‌ చేసిన ప్రకటనను తీవ్రంగా నిర సించాయి. అది పూర్తిగా అరకొర చర్య కాగలదని వ్యాఖ్యానించాయి. గాజా విధ్వంసానికి సంబంధించి ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. శాశ్వతంగా ప్రజ లను నిర్వాసితులను చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. నెతన్యాహు ప్రభుత్వం చేపట్టే ఈ దారుణ చర్యలను తామెంత మాత్రమూ సహించబోదని స్పష్టం చేసింది. దీనిపై నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ఆ దేశాలు ప్రకటించాయి. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో కొంతమంది వ్యక్తులు, గ్రూపులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. పాలస్తీనియన్లపై హింసాత్మక చర్యలకు పాల్పడినవారిలో వీరున్నారని పేర్కొంది.
76మంది మృతి
గాజాపై ఇజ్రాయిల్‌ విరుచుకుపడుతోంది. గాజా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 76మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉత్తర గాజాలోని ఒక ఇల్లు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన పాఠశాల భవనంపై జరిపిన రెండు దాడుల్లో 22మంది మరణించారని, వారిలో సగం మందికి పైగా మహిళలు, చిన్నారులే వున్నారని తెలిపారు. సెంట్రల్‌ సిటీ డేర్‌-అల్‌ -బలాV్‌ాలో జరిగిన దాడిలో 13మంది మరణిం చగా, సమీపంలోని నుస్రత్‌ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 15మంది మరణించారని అల్‌-అక్సా ఆస్పత్రి తెలిపింది. దక్షిణ నగరమైన ఖాన్‌ యూనిస్‌లో జరిగిన రెండు దాడుల్లో 10మంది మరణించారని నాజర్‌ ఆస్పత్రి పేర్కొంది. హమాస్‌ అదుపులో ఉన్న బందీలను విడిపించడంతో పాటు ఆ సంస్థను సమూలంగా తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్‌ పేర్కొంటోంది. ఇందుకోసం తన సైనిక చర్యలను విస్తరించినట్లు తెలిపింది.
మృత్యుముఖాన 14 వేలమంది శిశువులు !
గాజాలో ఆహార పంపిణీ జరగకపోతే అందకపోతే వచ్చే 48గంటల్లో సుమారు 14వేల మంది పిల్లలు ఆకలితో చనిపోవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ దాడులతో పూర్తిగా ధ్వంసమైన ఈ ప్రాంతంలోకి మరింత సాయం అందకపోతే తీవ్రమైన ముప్పు తప్పదని పేర్కొంది. 11 వారాల పాటు పూర్తిగా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సహా పలు దేశాల ఒత్తిడితో సోమవారం ఇజ్రాయిల్‌ అధికారులు పరిమిత సాయాన్ని పంపిణీ చేసేందుకు అనుమతించారు.
పిల్లలకు ఆహారంతో పాటు మానవతా సాయంతో కూడిన ఐదు ట్రక్కులు సోమవారం సాయంత్రం గాజాలోకి ప్రవేశించాయని ఐరాస మానవతా సంస్థ చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌ పేర్కొన్నారు. వారాల తరబడి పూర్తిగా దిగ్బంధనం నెలకొన్న పరిస్థితుల్లో అనుమతించిన ఈ సాయం ”సము ద్రంలో నీటి చుక్క” వంటిదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఈ సాయం అవసరమైన వారికి చేరుకోలేదని అన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు, పిల్లలకు ఈ సాయం చేరేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాకు తెలిపారు. శిశువుల ఆహారం, పోషకాహారంతో నిండిన మరో 100 ట్రక్కులను గాజాలోకి అనుమతించాలని ఐరాస కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -