Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గడిచిన రెండు సంవత్సరాలలో మీ అభివృద్ధి ఎక్కడ..?

గడిచిన రెండు సంవత్సరాలలో మీ అభివృద్ధి ఎక్కడ..?

- Advertisement -
  • – బీఆర్ఎస్ పార్టీ అడ్డగూడూర్ పట్టణ అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి
  • – ఎమ్మెల్యే , ఎంపీ చెంచాలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
  • – తెలంగాణ జాతిపిత కేసీఆర్  గురించి మాట్లాడే అంత స్థాయి ఏ మాత్రం మీది కాదు
  • మా మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్  గురించి మాట్లాడే భాష అహంకార , నీచపు బుద్ది మార్చుకోవాలి
  • నవతెలంగాణ- అడ్డ గూడూరు  :  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డగూడూర్ పట్టణ శాఖ అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి మాట్లాడుతూ… కొంతమంది  రాజకీయ నిరుద్యోగులు , ఎమ్మెల్యే, ఎంపీ గార్ల దగ్గర చెంచగిరి చేసేవాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని జ్ఞానంతో మాట్లాడాలి అని అన్నారు.  పదవులు లేకున్న నలుగురిని వేసుకొని నోటికివచ్చినట్లు మాట్లాడతాం అంటే ఊరుకునేది లేదు తస్మా జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అస్థిత్వ యాసను ప్రపంచం నివ్వెరపోయేలా వెలుగెత్తి చాటిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని అన్నారు.  హైద్రాబాద్ మహానగరాన్ని ప్రపంచ ఐటీ సంస్థలు మన తెలంగాణ వైపు చూసేలా చేసిన మహోన్నతమైన వ్యక్తి కేటీఆర్ అని , తెలంగాణ ప్రత్యేక ఉద్యమ చరిత్రలో ఉద్యమానికి అహర్నిశలు ముందుకు సాగించిన నాయకుడు హరీష్ రావు , ఉస్మానియా ఉద్యమ కెరటం , తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకువచ్చిన నాయకుడు బీడు భూములను సైతం  పచ్చని పొలాలుగా మార్చిన తుంగతుర్తి నియోజకవర్గం రైతు బాంధవుడు గాదరి కిషోర్ కుమార్ గురించి అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదు ,రాజకీయ నిరుద్యోగుల ఉన్న మీరు మీ ఎమ్మెల్యే, ఎంపీ లా దగ్గర చెంచగిరి చెయ్యండి కానీ పార్టీలో ఏ మాత్రం స్థాయి లేని మీరు నలుగురిని పక్కన వేసుకొని టీపిసిసి నాయకులం అని చెప్పుకుంటూ మీ స్థాయిని మర్చిపోయి మాట్లాడటం సిగ్గుచేటు మీరు మాట్లాడే భాష తీరు మారకపోతే తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు మీరు ఎక్కడ కనిపించిన తన్ని తరిమేస్తారు అనే విషయం మర్చిపోవద్దు అని హెచ్చరించారు .ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజారి సైదులు , బాబు మహాజన్ , గూడెపు పరమేష్, సోమిరెడ్డి పురుషోత్తం రెడ్డి , గజ్జెల్లి రవి , గూడెపు పరమేష్, గూడెపు మహేష్ , కూరుకుల పున్నం, బోయపల్లి కంట్లం,కంచి మచ్చగిరి , కురిమిండ్ల కరుణాకర్,, గూడెపు సురేష్, గజ్జెల్లి బాబు , ఎలిజాల దయాకర్ , కుథాటి గణేష్ , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -